అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్టార్ తో సూపర్ సక్సెఫుల్ గా సాగుతుంది. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా విచ్చేసారు. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది ఆహా.
Also Read : Mahesh Babu : సైలెంట్ గా షూటింగ్ మొదలెట్టిన మహేశ్ బాబు
ఈ స్టేజ్ పై రామ్ చరణ్ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు బాలయ్య. ఇన్నేళ్ల నీ సినీ కెరిర్ లో అసలు ఆ సినిమా ఎందుకు చేశాను అని ఫీల్ అయిన సినిమా ఏదైనా ఉందా, ఉంటే ఆ సినిమా పేరు చెప్పమని కోరారు బాలయ్య. అందుకు సమాధానంగా చరణ్ మాట్లాడుతూ ‘ కెరీర్ స్టార్టింగ్ లో ‘జంజీర్’ అనే సినిమా చేశాను. అది నేను నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా. అసలు ఆ సినిమా ఎందుకు చేసానో నాకే తెలియదు’ అని అన్నాడు. 1973 లో వచ్చిన అమితాబ్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా జంజీర్ ను అదే పేరోతో రీమేక్ చేసాడు రామ్ చరణ్. తెలుగులో ఈ సినిమాను తుఫాన్ పేరుతో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా డిజాస్టర్ గా మిగిలింది. అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది.