సూపర్ స్టార్ మహేశ్ బాబు తన లేటెస్ట్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను కూడా సైలెంట్ గా పూర్తి చేసారు. తన ఆనవాయితీగా భిన్నంగా రాజమౌళి సినిమాను గుట్టు చప్పుడు కాకుండా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఎప్పుదెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు మహేశ్ బాబు.
కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు బుధవారం ఓ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ వార్త నిన్న అటు సోషల్ మీడియాలోను, ఇటు టాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న SSMB29 ను సైలెంట్ షూట్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ లో ఒకటే చర్చ. అయితే ఈ విషయమై ఆరా తీయగా మహేశ్ బాబు షూటింగ్ లో పాల్గొన్న మాట వాస్తవమే కానీ అది రాజమౌళి సినిమా కాదని వివరణ ఇచ్చారు. సూపర్ స్టార్ ఇటీవల ట్రూ జోన్ సోలార్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.దానికి సంబందించిన యాడ్ షూట్ లో మహేశ్ తాజాగా జాయిన్ అయ్యాడు. ఈ షూట్ లో మహేశ్ తో పాటు మిల్కి బ్యూటి తమన్నా కూడా పాల్గొంది. ఆగడులో కలిసి నటించిన ఈ జంట ఆ మధ్య ఓ యాడ్ నటించగా తాజాగా సోలార్ యాడ్ లో కలిసి నటించారు.