Hyper Aadhi: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో హైపర్ ఆది ఒకడు.. కామెడీ టైమింగ్ కేరాఫ్ అడ్రెస్స్.. పంచ్ డైలాగ్స్ కు పర్మినెంట్ అడ్రెస్స్ గా ఆది పేరు మారుమ్రోగిపోతోంది. ఇక జబర్దస్త్ నుంచి మెల్లగా సినిమాల్లోకి వచ్చాడు ఆది. కమెడియన్ గానే కాకుండా మాటల రచయితగా కూడా మారాడు. ధమాకా సినిమాకు డైలాగ్స్ ఇచ్చింది హైపర్ ఆదినే అంట. ఇక ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న ఆది.. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఆది మొదటి కోలీవుడ్ మూవీ వాతి. అదేనండీ తెలుగులో సార్. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్. ఫిబ్రవరి 17 న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పై పంచ్ లు వేశాడు.
Sir Trailer: మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతోంది.. ఏం చెప్పారు ‘సార్’
” మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు.. పైకి ప్రొడ్యూసర్ లా కనిపిస్తాడు కానీ ఆయనలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఆయన లోపాలు అర్జున్ రెడ్డి అంత యాటిట్యూడ్ ఉంటుంది.. అల్లు అర్జున్ గారంత యాక్టివ్ నెస్ ఉంటుంది. త్రివిక్రమ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి చిన్న రైమింగ్, టైమింగ్ ఉంటుంది. వీటన్నింటి మధ్యలో ఆయనకెప్పుడైనా నిజాయితీగా అనిపించి ఒక మాట అంటే అది మీకు వేరేలా అనిపించి ఏదేదో రాసేస్తారు. నిజం చెప్పాలంటే..పాపం ఆయన చాలా నిజాయితీగా మాట్లాడతాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్.. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను భీమ్లా నాయక్ సాంగ్ నాలుగు రోజులు షూట్ చేశాను. ఆ సమయంలో ఒకరోజు ఆయనకు ఫోన్ చేసి సార్.. ఒక హాఫ్ డే కావాలి సార్.. ఢీ షూటింగ్ కు అడుగుతున్నారు అని చెప్పా.. అలా అడిగితే ఏ నిర్మాత అయినా ఏం చెప్తాడు.. అమ్మోమ్మో కుదరదమ్మా.. ఇది చాలా ముఖ్యం.. కానీ ఆయన స్ట్రైట్ గా ఏం చెప్పారో తెలుసా.. ఢీ కావాలా.. పవన్ కళ్యాణ్ గారు కావాలా అని అడిగారు. ఆ ఒక్క మాటతో నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ భీమ్లా నాయక్ షూటింగ్ కు వెళ్ళాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హైపర్ ఆది వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.