Sir Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అవుతోంది. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడిన సార్ ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ప్రభుత్వ విద్యను.. కొంతమంది ప్రైవేట్ కాలేజీలు ఎలా మోసం చేస్తున్నాయి.. వాటిని ఒక జూనియర్ లెక్చరర్ ఎలా అడ్డుకున్నాడు అనేది సార్ కథ అని టీజర్ లోనే చూపించేశారు. ఇక ట్రైలర్ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ మేళవించి కట్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది.
Satyadev: చిరంజీవి విలన్ ఫ్యామిలీ పిక్ అదిరింది గురూ..
“ఎవరు సార్ ఆయన.. నా గురు బాలు సార్” అని ఒక వ్యక్తి ఎమోషనల్ గా చెప్తున్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఈ దేశంలో చదువు అనేది ఒక నా ప్రాఫిటబుల్ సర్వీస్ అని సముద్ర ఖని బేస్ వాయిస్ తో చెప్పడంతోనే ఆయనే విలన్ అని తెలిసిపోతోంది. సింపుల్ గా కథ విషయానికొస్తే.. త్రిపాఠీ ఇన్స్టిట్యూషన్స్ తరుపున రాష్ట్రంలో ఉన్న కొన్ని గవర్నమెంట్ కాలేజ్ లను సముద్ర ఖని దత్తత తీసుకుంటాడు. అక్కడికి జూనియర్ లెక్చర్లను చదువు చెప్పడానికి పంపిస్తాడు. అలా ఒక గ్రామంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్ కు లెక్చరర్ గా వెళ్లిన సార్.. బాలు. ఆ కాలేజ్ లో అతనికి మీనాక్షి అనే బయోలజీ టీచర్ తో ప్రేమలో పడతాడు. పేరుకు ప్రభుత్వ కాలేజే కానీ, ఆ ఊర్లో విద్యార్థులు కాలేజ్ కు రావాలంటే ఫీజ్ కట్టాల్సిందే. అందుకని హాజరు పత్తిలో పేర్లు ఉన్నా కాలేజ్ కు మాత్రం ఎవరు రారు. ఇక బాలు సార్ వచ్చిన దగ్గరనుంచి ఈ విధానం మారుతుంది. విద్య అనేది వ్యాపారం కాదని చెప్పి విద్యార్థులందరికీ ఫ్రీగా చదువు చెప్తూ ఉంటాడు. అది నచ్చని త్రిపాఠీ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మెన్ సముద్ర ఖని, బాలును చంపడానికి ప్లాన్ చేస్తాడు.. ఇక వారికి ఎదురు తిరిగి సార్ ఏం చేశాడు..? చివరికి విద్యను వ్యాపారం కాకుండా అడ్డుకున్నాడా..? అనేది కథ. ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా విద్య గురించి ధనుష్ చెప్పిన డైలాగ్స్ అయితే దుమ్ము రేపడం ఖాయమని చెప్పాలి. ” డబ్బును ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ, మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతోంది.. అనే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఇక జీవి ప్రకాష్ సంగీతం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.