Shekar Movie: రాజ’శేఖర్’ సినిమాకు షాక్.. ప్రదర్శనలు నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంగ్రీమెన్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కోర్టు ఆదేశించినా రాజశేఖర్ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన నటించిన ‘శేఖర్’ ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్‌లోనూ ప్రసారం చేయరాదని కోర్టు పేర్కొంది. దీంతో పలుచోట్ల శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.
Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ చేసిన దర్శకుడు
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై హీరో రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శేఖర్ చిత్రాన్ని తనతో తన కుటుంబం సర్వస్వంగా భావించిందని.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడినట్లు రాజశేఖర్ తెలిపాడు. ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోందని.. దీంతో కావాలనే కొందరు తమపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. దీనిపై తాను చెప్పాల్సిందేమీ లేదని.. ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని తాను భావిస్తున్నట్లు రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. కాగా మే 20న విడుదలైన శేఖర్ సినిమాలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించింది.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!