జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ‘అవతార్ 2’ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ‘అవతార్ 2’ ఉంది. ఓవరాల్ గా అన్ని ఏరియాలు కలుపుకోని ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 136.5 మిలియన్ డాలర్లని రాబట్టింది (ఇండియన్ కరెన్సీలో 1125.17 కోట్లు). ఇక రెండో రోజు మాత్రం ‘అవతార్ 2’ కలెక్షన్స్ ని డ్రాప్ కనిపించింది. సెకండ్ డే ‘అవతార్ 2’ సినిమా 70 మిలియన్ డాలర్లని రాబట్టింది(రూ. 579.13 కోట్లు). మొదటిరోజు కన్నా 66 మిలియన్ డాలర్స్ డ్రాప్ కనిపించడంతో ‘అవతార్ 2’ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం కష్టం, సినిమా లెంగ్త్ ని తగ్గించాల్సి ఉంది, 2 బిలియన్స్ రాబట్టడం అయ్యే పని కాదు అంటూ రకరకాల విమర్శలు వినిపించడం మొదలయ్యింది.
‘అవతార్ 2’ సినిమాపై వస్తున్న విమర్శలకి దర్శకుడు ‘జేమ్స్ కమరూన్’ కారణమని చెప్పాలి. 350-400 మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి తీసిన సినిమాకి, 800 మిలయన్ డాలర్స్ వస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. అయితే ‘అవతార్ 2’ సినిమా 2 బిలియన్ డాలర్స్ రాబట్టాలి అని జేమ్స్ కమరూన్ అనడంతో… ఆడియన్స్ అంతా 2 బిలియన్ డాలర్స్ ని బ్రేక్ ఈవెన్ మార్క్ ఏమో అనుకున్నారు. అందుకే కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించగానే బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వదు అనే కామెంట్స్ చేస్తున్నారు. లాంగ్ వీకెండ్స్, హెవీ ఫుట్ ఫాల్స్ రాబడితేనే ‘అవతార్ 2’ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుంది అనే వాళ్లు కూడా ఉన్నారు.
నిజానికి జేమ్స్ కమరూన్ సినిమాలు ఫస్ట్ వీకెండ్, సెకండ్ వీకెండ్ కి థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకోవు. జేమ్స్ కమరూన్ సినిమాలకి చాలా లాంగ్ రన్ ఉంటుంది, ‘అవతార్ పార్ట్ 1’ ఇండియాలోనే వంద రోజులు ఆడింది అంటే ఎంత లాంగ్ రన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. సో ‘అవతార్ 2’ కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించినా కూడా వచ్చేది క్రిస్మస్ సీజన్ కావడం, వెస్ట్రన్ కంట్రీస్ లో డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్ సెలవలు ఉండడం అవతార్ 2 సినిమాకి లాంగ్ రన్ లో కలిసొచ్చే విషయాలు. మండేకి బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యే ‘అవతార్ 2’ సినిమా ఓవరాల్ రన్ లో 1.5 బిలియన్ డాలర్స్ వరకూ రాబట్టే ఛాన్స్ ఉంది కానీ జేమ్స్ కమరూన్ కోరుకున్నట్లు 2 బిలియన్ డాలర్స్ రావడం అనేది ఇప్పటికి కష్టమైన విషయమే.