Huge Demand for Adipurush Tickets in Telugu States: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా 2 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
Also Read: #VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ
సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. తానాజీ లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ఓం రౌత్ సినిమాని డైరెక్ట్ చేయడం బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండడంతో సినిమా మీద అంచనాల అంతకు అంతకు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 160 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. జీఎస్టీతో కలిపి టి సిరీస్ సంస్థకు 185 కోట్ల రూపాయల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi: వచ్చే సంక్రాంతి బరిలో ఇంకా పట్టాలెక్కని చిరంజీవి సినిమా?
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా టికెట్లు ఇప్పించమని పెద్ద ఎత్తున ఆబ్లిగేషన్స్ వస్తున్నాయట. ఒకప్పుడు ఎలా అయితే ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాల టికెట్లు కావాలని ఫోన్లు వచ్చేవో ఇప్పుడు ఈ సినిమాకి కూడా పై స్థాయి నుంచి రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీల నుంచి కూడా అదే రేంజ్ లో ఫోన్లు వస్తున్నాయి అని తెలుస్తుంది. ఒక రకంగా చూసుకుంటే మెంటల్ ఎక్కి పోయేలా వారికి ఫోన్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.