Swastika Mukherjee:సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ హీరోయిన్స్ కు లైంగిక వేధింపులు ఉండడం సాధారణమే. వాటిని కొంతమంది బయటపెడతారు.. ఇంకొంతమంది బయట పెట్టలేరు. అవకాశాల కోసం హీరోతో, నిర్మాతతో బెడ్ షేర్ చేసుకోవాలని కోరినట్లు చాలామంది హీరోయిన్లు మీడియా ముందే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ ను నటీమణులు ఎప్పటినుంచో ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ.. తన నిర్మాత తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బెంగాలీ ఇండస్ట్రీలో స్వస్తిక స్టార్ నటి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం ‘శిబ్ పుర్’. ఈ సినిమా మే 5 న రిలీజ్ కానుంది. కొన్ని రోజుల్లో తన సినిమా రిలీజ్ పెట్టుకొని ఆమె.. తన సినిమా నిర్మాతపై ఘాటు ఆరోపణలు చేసి షాక్ ఇచ్చింది.
Mrunal Thakur: అయ్యో.. సీతా.. నువ్వు మా గుండెలను ముక్కలు చేసేశావ్
బెంగాలీ చిత్ర పరిశ్రమలో టాప్ నిర్మాత అయిన సందీప్ సర్కార్ తనను లైంగికంగా వేధించినట్లు ఆమె తెలిపింది. మార్ఫింగ్ చేసిన తన నగ్న ఫోటోలను, వీడియోలను తనకు ఈమెయిల్ చేసి వేధిస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా ఆ ఫోటోలను, వీడియోలను పోర్న్ వెబ్ సైట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని కూడా తెలిపింది. ఈ విషయమై తాను .. గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేసినట్లు స్వస్తిక చెప్పుకొచ్చింది. పోలీసులు సైతం అతనిపై కఠిన చర్యలు తీసుకోకపోయినా యెడల.. తన దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌ను ఆమె సంప్రదించనున్నట్లు సమాచారం. అయితే స్వస్తికను డైరెక్టరే ప్రేరేపించి, నిర్మాతపై కేసుపెట్టమన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుండగా.. వాటిని డైరెక్టర్ కొట్టిపారేశారు. “ఇది అబద్ధం. నేను ఎలాంటి నెగెటివ్ ప్రచారాన్ని నమ్మను. మరి స్వస్తిక లాంటి నటిని ప్రోత్సహిస్తా.. కానీ, ఆమె ఏ రీజన్ లేకుండా ఇలా ఎందుకు చేస్తుంది” అని ప్రశ్నించాడు. మరి ఈ ఆరోపణలపై నిర్మాత ఎలా స్పందిస్తాడో చూడాలి.