Hrithik Roshan: ప్రతి ఒక్క హీరోకు అభిమానులు ఉంటారు. తాము ఎంతగానో ఆరాధించే హీరోలే అభిమానులకు దేవుళ్ళు. థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు పెట్టి, దండాలు వేసి, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక వారే ఎదురైతే దేవుడు కనిపించినంత సంతోషంగా కాళ్లు మొక్కుతూ ఉంటారు. ఇది అన్ని చోట్లా చూసే సీనే. అయితే తాజాగా ఈ సీన్ రివర్స్ అయ్యింది. ఒక అభిమాని స్టార్ హీరో కాళ్లు పట్టుకోగానే.. వెంటనే అతడిని ఆపి ఆ స్టార్ హీరో తన అభిమాని కాళ్లు పట్టుకున్నాడు. స్టేజి మీద అందరు చూస్తుండగా ఆ హీరో చేసినపని అందరు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్. ఈ ఘటన శనివారం ముంబైలో చోటుచేసుకొంది.
వివరాల్లోకి వెళితే.. హృతిక్ రోషన్ శనివారం ఒక ప్రైవేట్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఇక తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ అందరు అక్కడకు చేరుకున్నారు. ఈవెంట్ అయిపోయాక ఫోటోలు దిగడానికి అభిమానులు వస్తుండగా.. ఒక ఫ్యాన్ రావడమే హృతిక్ కాళ్లకు నమస్కారం చేసి ఫోటో కోసం అడిగాడు. ఇక వెంటనే హృతిక్ సైతం ఆ అభిమాని కాళ్లు పట్టుకొని అతడిని దగ్గరకు తీసుకున్నాడు. ఈ అనుకోని సంఘటనకు సదురు అభిమాని షాక్ అయ్యి ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. డౌన్ టూ ఎర్త్ హీరో అంటే హృతిక్ అని కొందరు.. ఎంతటి సంస్కారమున్న హీరోను మేము చూడలేదు అని మరికొందరు అంటుండగా.. నిజంగా హృతిక్ ఒక సూపర్ స్టార్.. ఇలా చేయడానికి చాలా గట్స్ ఉండాలి అంటూ పొగిడేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం హృతిక్ .. విక్రమ్ వేద చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది