Houseful occupancies for Movie Primeiers in Hyderabad: ఈ మధ్యకాలంలో సినిమా చిన్నదైనా, పెద్దదైనా కంటెంట్ మీద నమ్మకం ఉంటే కనుక ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న ట్రెండు బాగా పెరిగింది. చాలా చిన్న సినిమాలకు ఈ ప్రీమియర్స్ బాగా కలిసి వచ్చాయి కూడా. దాదాపు రైటర్ పద్మభూషణ్, సామజవరగమన ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాలకి ఈ పైడ్ ప్రీమియర్స్ ట్రెండ్ అద్భుతంగా కుదిరింది. అయితే ఈ సినిమాల ప్రీమియర్స్ వేసినప్పుడు ఆ సినిమా ఎలాంటిదైనా కానివ్వండి అంటే ఇతర భాషల్లో తెరకెక్కి తెలుగులో డబ్బింగ్ అవుతున్నా సరే లేదా నేరుగా తెలుగు సినిమా అయినా సరే లేక ఏదైనా ఇంగ్లీష్ సినిమా అయినా సరే అసలు సినిమా మీద ఎలాంటి బజ్ లేకపోయినా సరే హైదరాబాద్ విషయానికి వస్తే దాదాపు ఆ ప్రీమియర్స్ అన్నింటికీ 85% ఆక్యుపెన్సీ కనిపిస్తుంది.
Hrashwo Deergha: మొట్టమొదటి తెలుగు నేపాలీ సినిమాలో బ్రహ్మానందం.. ఆరోజే రిలీజ్
ఒక మాటలో చెప్పాలంటే 85% అంటే హౌస్ ఫుల్ గానే లెక్కించాల్సి ఉంటుంది. హీరో చిన్నవాడా, పెద్దవాడా, దర్శకుడు చిన్నవాడా, పెద్దవాడా లేక సినిమా బడ్జెట్ చిన్నదా, పెద్దదా ఇలాంటి లెక్కలు లేకుండా హైదరాబాద్ లో మాత్రం దాదాపు అన్ని పెయిడ్ ప్రీమియర్స్ కి ఇలాంటి ట్రెండ్ కనిపిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడెందుకు ఈ విషయం హాట్ టాపిక్ అవుతుంది అంటే సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో పాటు యష్ పూరి అని ఒక సినిమా అనుభవం ఉన్న కొత్త హీరో నటించిన హ్యాపీ ఎండింగ్ సినిమాకి కూడా ఈ పెయిడ్ ప్రీమియర్ హౌస్ ఫుల్ అయింది. అంటే హైదరాబాదులో సినిమాని ఎంతగా ప్రేమిస్తారో దీనికన్నా పెద్ద ఉదాహరణ చెప్పాల్సిన పని లేదు అని ట్రేడ్ వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ సినీ లవర్స్ అయితే హైదరాబాదోళ్లు అంటార్రా బాబు అంటూ కాలర్ ఎగరేస్తారని వారు అంటున్నారు. మరి ఇందులో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.