‘కేజీఎఫ్ 2’ సక్సెస్ ను చిత్రబృందం మొత్తం ఎంజాయ్ చేస్తోంది. ఏప్రిల్ 14న వచ్చిన ఈ సినిమా సందడి ఇంకా తగ్గనేలేదు. ‘కేజీఎఫ్’ మూవీ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేరు కూడా మారుమ్రోగిపోయింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. ఇటీవలే లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ సినిమాను ప్రకటించిన ఈ నిర్మాణ సంస్థ తాజాగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని అనౌన్స్ చేసింది. దివంగత లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ బాధ్యతను తీసుకున్నారు.
Read Also : Raviteja : మాస్ మహారాజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం
పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ను వెండితెరకు పరిచయం చేయబోతోంది హోంబలే ఫిల్మ్స్. ఈ మేరకు విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఆసక్తికర పోస్టర్‌లను విడుదల చేస్తూ, “ది లెగసీ కంటిన్యూస్” అంటూ రాసుకొచ్చారు. పునీత్ ‘యువరత్న’తో సహా పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. ఈ సినిమాను నిర్మించి, దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ.
ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆThe legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/Yp3bofVgZO
— Hombale Films (@hombalefilms) April 27, 2022