Hidimba: ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్టా.. ఫట్టా అని చెప్పేస్తున్నారు అభిమానులు. ఇక మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు కొన్నిరోజులు సౌండ్ చేసి.. ఆతరువాత ఆగిపోతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాయి. అందులో ఒకటి హిడింబ. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిడింబ. అశ్విన్ సరసన నందితా శ్వేత నటించింది. జూలై 20 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కొనసాగుతోంది. కథాకథనం కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు భారీగానే క్యూ కడుతున్నారట. అశ్విన్ నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పుకొస్తున్నారు. హీరోగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అశ్విన్.. విలన్ ను వెతికే క్రమంలో శ్వేతా చేసిన ఇన్వెస్టిగేషన్ బావుందని అంటున్నారు. అంతకు మించిన మేకింగ్ పరంగా హై వెల్యూమ్ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది.
Sobhita Dhulipalla: ఆ కాయిన్ నా జీవితాన్ని మార్చేసింది..
ఇక అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. తినడం అనేది ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్. అసలు ఆ నరమాంస భక్షకుడు ఎవరు.. ? ఎందుకు ఇలా చేస్తున్నాడు.. ? అనేది చాలా చక్కగా చెప్పాడని ప్రేక్షకులు అంటున్నారు.ఇక కలెక్షన్స్ సైతం బాగానే రాబడుతుందని అంటున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.0.58 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి రూ.2.42 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇంకోపక్క బేబీ రికార్డ్ కలెక్షన్స్ రాబడుతున్నా.. హిడింబ తనదైన మార్క్ తో ముందుకు దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరో రెండు రోజులు ప్రేక్షకులకు సినిమా ఎక్కింది అంటే.. ముందు ముందు మంచి కలక్షన్స్ అందుకొనే అవకాశం ఉంది అంటున్నారు. మరి హిడింబ .. ఎలాంటి వసూళ్లను రాబడుతోందో చూడాలి.