Yami Gautham: యామీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఆమె ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. ఇక ఆ యాడ్ తరువాత ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించినా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం గౌరవం సినిమాతోనే. అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా గౌరవం. ఈ సినిమాలో శిరీష్ సరసన యామీ నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేనప్పటికీ యామీకి మంచి అవకాశాలు అయితే తలుపు తట్టాయి. ఈ సినిమా తరువాత తెలుగులో యామీ.. నితిన్ సరసన కొరియర్ బాయ్ కళ్యాణ్, యుద్ధం సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలు కూడా యామీకి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఇక అక్కడ మంచి మంచి సినిమాలతో స్టార్ డమ్ ను దక్కించుకుంది.
2019లో యూరి: ది సర్జికల్ స్ట్రైక్ సెట్స్‌లో డైరెక్టర్ ఆదిత్య ధర్ తో యామీ ప్రేమలో పడింది. ఈ జంట రెండేళ్లపాటు డేటింగ్ తర్వాత జూన్ 4, 2021న పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా యామీ ప్రెగ్నెంట్ అని అధికారికంగా ప్రకటించింది. మే లో తమ చిన్నారి ఇంటికి వస్తుందని తెలిపింది. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం యామీ ఆర్టికల్ 370 అనే సినిమాలో నటిస్తోంది. ప్రియమణి, యామీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ నే దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమాతో యామీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.