HBD Vikram : విలక్షణమే విక్రమ్ ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభ ఉండాలే కానీ, పట్టం కట్టడానికి చిత్రసీమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎన్నో మార్లు రుజువయింది. విక్రమ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పవచ్చు. చిత్రసీమలో రాణించాలని విక్రమ్ చిన్నతనం నుంచీ కలలు కన్నారు. సినిమాల్లో తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపించారు. తమిళ చిత్రాలలోనే కాదు కొన్ని తెలుగు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఏదీ తగిన గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. ఇక నటనకు గుడ్ బై చెప్పి వేరే బాట పట్టాలనే యోచనలో ఉన్న విక్రమ్ కు ‘సేతు’ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ‘సేతు’లో విలక్షణమైన పాత్ర అయితే వరించింది. కానీ, ఆ సినిమా వెలుగు చూడటానికి పలు పాట్లు పడింది. చివరకు జనం ముందు నిలిచిన ‘సేతు’తో విక్రమ్ ఒక్కసారిగా ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. అప్పటి నుంచీ విలక్షణమైన పాత్రలకు విక్రమ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. తమిళ జనం గుండెల్లో ‘చియాన్’గానూ నిలిచారు.
విక్రమ్ అసలు పేరు కెన్నడీ జాన్ విక్టర్. 1966 ఏప్రిల్ 17న జన్మించారు.ఆయన తండ్రి జాన్ విక్టర్ తరువాత వినోద్ రాజ్ పేరుతో తమిళ చిత్రాల్లో నటించారు. అయితే వినోద్ రాజ్ ఎన్ని చిత్రాలలో నటించినా, తాను కలలు కన్న స్టార్ డమ్ సొంతం చేసుకోలేక పోయారు. విక్రమ్ తల్లి రాజేశ్వరి సబ్ కలెక్టర్ గా పనిచేసేవారు. ఆమె తమ్ముడు ప్రముఖ నటుడు త్యాగరాజన్. తండ్రి, మేనమామ ఇద్దరి జీన్స్ కారణంగానేమో విక్రమ్ కు కూడా నటనపట్ల అమితాసక్తి కలిగింది. చదువుకొనే రోజుల నుంచీ విక్రమ్ నటుడు కావాలని తపించారు.
ఆరంభంలో విక్రమ్ “చిరునవ్వుల వరమిస్తావా, అక్కపెత్తనం -చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఆడాళ్ళా మజాకా, ఊహ, అక్కా బాగున్నావా?, మెరుపు, కుర్రాళ్ళ రాజ్యం, 9 నెలలు, యూత్” వంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లో నటించారు. ‘సేతు’ ఘనవిజయం సాధించిన తరువాత కూడా అంతకు ముందు అంగీకరించిన ‘యూత్’ చిత్రాన్ని పూర్తి చేశారు విక్రమ్. ఆ తరువాత నుంచీ విక్రమ్ తమిళనాట స్టార్ హీరో అయిపోయారు. వరుసగా వైవిధ్యమైన పాత్రల్లో తనదైన అభినయం ప్రదర్శిస్తూ సాగిపోయారు. విక్రమ్ హీరోగా తమిళనాట ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలను తెలుగు స్టార్ హీరోస్ రీమేక్ చేయడం విశేషం. విక్రమ్ తో ‘సేతు’ తెరకెక్కించిన దర్శకుడు బాలా తరువాత అతనితో తీసిన ‘పితామగన్’ తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువాదమైంది. ఈ సినిమాతోనే విక్రమ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించారు. ‘శివపుత్రుడు’ సినిమా తెలుగులోనూ విశేషాదరణ చూరగొంది. ఇక ‘జెంటిల్ మేన్’ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘అన్నియన్’ తెలుగులో ‘అపరిచితుడు’గా అలరించింది. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. ఆ తరువాత నుంచీ విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలతో సాగుతూనే ఉన్నారు. కానీ,’అపరిచితుడు’ స్థాయి విజయం మాత్రం మళ్ళీ విక్రమ్ కు దక్కలేదనే చెప్పాలి.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
నటునిగానే కాకుండా, గాయకునిగానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, టీవీ షోస్ తోనూ జనాన్ని ఆకట్టుకున్నారు విక్రమ్. తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నారు విక్రమ్. ఏదో ఒకరోజు విక్రమ్ మళ్ళీ విజృంభిస్తాడని అభిమానుల అభిలాష. ప్రస్తుతం విక్రమ్ నాలుగు చిత్రాలలో నటిస్తున్నాడు. వాటిలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వం’, గౌతమ్ మీనన్ ‘ధ్రువ నచ్చత్రం’, అజయ్ జ్ఞాన ముత్తు తెరకెక్కిస్తున్న ‘కోబ్రా’ ఉన్నాయి. వీటితో పాటు విక్రమ్ 61వ చిత్రంగా పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా రానుంది. ఇలా ఇప్పటికీ బిజీగానే సాగుతున్న విక్రమ్ రాబోయే రోజుల్లో మళ్ళీ మునుపటిలా అలరిస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!