‘ఆట కదరా శివ’, ‘మిస్ మ్యాచ్’, ‘క్షణక్షణం’ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు నటుడు ఉదయ్ శంకర్. అతను హీరోగా, జన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ లో హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలతో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ ఇచ్చి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
హీరో ఉదయ్ శంకర్ తండ్రి, ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేసి చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు. ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి యూనిట్ కి విషెస్ తెలిపారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువతను ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని నిర్మాత అట్లూరి నారాయణరావు తెలిపారు. ‘ఇదే మా కథ’ వంటి యూనిక్ కాన్సెప్ట్ మూవీని తెరకెక్కించిన గురు పవన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 25 నుండి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, మొదటి షెడ్యూల్ 20 రోజులు ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు.