యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ బజ్ క్రియేట్ చెయ్యడమే కాకుండా మైఖేల్ సినిమాపై అంచనాలని కూడా పెంచింది. ఈ టీజర్ ని కలర్ టోన్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన యూనివర్సల్ కంటెంట్ తోనే మైఖేల్ సినిమా రూపొందింది అనే నమ్మకం టీజర్ తోనే కలిగించారు మేకర్స్.
Read Also: Naatu Naatu: వెస్ట్రన్ గడ్డపై మన నాటు డాన్స్ హవా…
“మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి”, “మైఖేల్.. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం..” అని అయ్యప్ప శర్మ వాయిస్ ఓవర్ తో అంటుండగా.. “నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడు అవ్వాలనే ఆశ లేదు” లాంటి డైలాగ్స్ టీజర్ లో బాగా పేలాయి. ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా షూటింగ్ పార్ట్ కి పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మైఖేల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది, జనవరి 21న ట్రైలర్ రిలీజ్ చేసి మేకర్స్ ‘మైఖేల్’ సినిమాని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఇక శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Theatrical Trailer on Jan 21st😎
Team #Michael wraps the shoot on a high note ❤️🔥
Meet the Man who loved the hardest, In theatres this Feb 3rd 👊🏾#HappyMakarSankranti@sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @jeranjit @SamCSmusic @SVCLLP @KaranCoffl @adityamusic pic.twitter.com/JC7hJpo6mR
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 15, 2023