Raj Tarun : నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో హీరో రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు నమోదు అయింది. కోకాపేట్‌లోని విల్లాలో నివాసం ఉంటూ తనపై దాడి జరిగిందని లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య తన ఫిర్యాదులో మూడు వేర్వేరు సందర్భాల్లో రాజ్ తరుణ్ అనుచరులు దాడులు చేసినట్లు ఆరోపించారు. 2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేట్‌లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు.
CM Revanth Reddy : పేదల ఆశయమే మా ఆత్మగౌరవం
అయితే, విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని, బెల్టులు, గాజు సీసాలతో కొట్టి తాను ధరించిన బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని లావణ్య ఆరోపించారు. ఇంకా, ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ దాడి జరిగిందని తెలిపారు. లావణ్య తన పెంపుడు కుక్కలను కూడా చంపేశారని, తండ్రిపై కూడా దాడి చేసి గాయపరిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
YS Jagan: ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..