కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తన తొలి చిత్రం బలగం. ప్రియదర్శి మరియు కావ్యా కల్యాణ్ రామ్ కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు, కుటుంట విలువలకు అద్దం పట్టేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమా ను రూపొందించాడు దర్శకుడు వేణు.మెగాస్టార్ చిరంజీవి వంటి గ్రేట్ స్టార్ కూడా బలగం సినిమాను చూసి మెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి.అలాగే ఈ సినిమాను తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి మరీ బలగం సినిమా ను ప్రదర్శించారు అంటే ఈ మూవీ కి ఎంత ప్రత్యేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు.. తాజాగా న్యాచురల్ స్టార్ నాని బలగం ను చూశాడని తెలుస్తుంది.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ నేను ఇన్ని రోజులు ఇంత మంచి సినిమాను ఎందుకు చూడలేకపోయానో నేను అసలు నమ్మలేకపోతున్న అంటూ ట్వీట్ చేశాడు.
‘నేను ఇంత ఆలస్యంగా బలగం మూవీని చూశానంటే ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నాను.ఇలాంటి సినిమాలు కదా తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. వేణు మరియు దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్. అలాగే ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ సహా ఈ అద్భుతమైన మూవీకి పని చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరందరూ ఈ సినిమా లో నటించలేదు జీవించేశారు’ అని ట్వీట్ చేసాడు.నాని చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ‘ఇంత మంచి సినిమాను ఇంత లేటుగా చూశావేంటి నాని బ్రో’ అని నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.బలగం సినిమాతో దర్శకుడు వేణు కు క్రేజ్ కూడా బాగా పెరిగింది. వేణు తెరకెక్కించే రెండవ సినిమాను భారీ బడ్జెట్ తో తీసేందుకు నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే తన రెండవ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు వేణు ఒక పోస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే.