Tabu : సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కీలక పాత్రల్లో చేస్తోంది. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్లలో చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆమె గతంలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో చేసిన సినిమాలో రొమాంటిక్ సీన్లలో నటించింది. వాస్తవానికి టబు కంటే ఇషాన్ చాలా చిన్నవాడు. సీనియర్ బ్యూటీతో అలాంటి సీన్లు చేయడంపై తాజాగా ఇషాన్ స్పందించాడు. టబు చాలా అనుభవజ్ఞురాలు అని.. ఆమెకు అలాంటి సీన్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు కిషన్.
Read Also : Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
‘ఆమెకు అలాంటి సీన్లు కొత్త కాదు. ఆ సీన్లలో తర్వాత ఏం జరుగుతుందో ఆమెకు చెప్పాల్సిన పనిలేదు. ఆమె అద్భుతమైన నటి. అందుకే నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నా కంటే వయసులో పెద్ద అయినా యంగ్ అమ్మాయిలాగే ప్రవర్తిస్తుంది. అందుకే కంఫర్ట్ గా ఫీల్ అయ్యాం. ఆమె ఆ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయినా ఇలాంటి సీన్ల గురించి తర్వాత మళ్లీ మాట్లాడాల్సిన పనిలేదు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఆమె సెట్స్ లో చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్. వీరిద్దరూ గతంలో ‘ఎ సూటిబుల్ బాయ్’ అనే వెబ్ సిరీస్ లో చేశారు. అందులో ఇద్దరూ ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయి నటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
Read Also : YSR-Kadapa District: మరోసారి మారిన కడప జిల్లా పేరు.. ఉత్తర్వులు జారీ..