YSR-Kadapa District: మరోసారి మారిన కడప జిల్లా పేరు.. ఉత్తర్వులు జారీ..
- మరోసారి మారిన కడప జిల్లా పేరు..
- వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు..
- అభ్యంతరాలకు ఈనెల 25 తేదీతో ముగిసిన గడువు..
- ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో జీవో జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR-Kadapa District: మరోసారి మారిన కడప పేరుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గతంలో ఉన్న కడప పేరును గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, దీనిపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కడప పేరు మార్పుపై ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ వచ్చాయి… ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప పేరు మార్పు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది… వైఎస్సార్ పేరుతో పాటు కడప అన్న పదాన్ని కూడా చేర్చాలని ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కడప పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెలలోపు తెలపాలని కడప కలెక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఈనెల 25 ఆఖరి తేదీ గడువు ముగియడంతో పాటు, ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వానికి కడప పేరు మారుస్తూ నివేదికలు పంపారు జిల్లా అధికారులు… ఈ మేరకు ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ వైఎస్సార్ కడప జిల్లాగా ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం..
Read Also: KTR: సీఎం మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద అనుమానం కలుగుతుంది..
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
దీంతో, ఇకపై వైఎస్సార్ జిల్లా కాస్తా.. వైఎస్సార్ కడప జిల్లాగా మారిపోయిందన్నమాట.. కాగా, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇకపై వైఎస్ఆర్ కడపగా జిల్లా పేరు మార్చాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!