Here is the Backstory of PVR INOX Vs Malayalam Movies: తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ చైన్ లో మలయాళ డబ్బింగ్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ ప్రదర్శన నిలిపివేశారు అంటూ ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పెద్ద ఎత్తున ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ విషయం మీద తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇన్వాల్వ్ అయి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇదంతా జరగడానికి వెనుక అసలు కారణం ఏమిటి అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం కేరళ నిర్మాతలు అని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో కొంతమంది సభ్యులు కలిసి ఒక కంటెంట్ ప్రొవైడింగ్ కంపెనీ మొదలుపెట్టారు. పి డి సి పేరుతో ప్రారంభించబడిన ఈ కంపెనీ నుంచి అన్ని థియేటర్లు డిజిటల్ ప్రింట్స్ కొనాలని ఒక మ్యాండేడ్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
Gopichand 32 Viswam: మాస్ గోపీచంద్ ఈజ్ బ్యాక్.. ఇదేంటన్నా ఈ రేంజ్ లో ఉంది!
అయితే ఈ నేపద్యంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ చైన్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న పివిఆర్ ఐనాక్స్ పిడిసి నుంచి కంటెంట్ కొనకూడదు అని నిర్ణయించుకుంది. అంతేకాక తమ ధియేటర్ల చైన్ లో తమను ఇబ్బంది పెట్టాలని చూసిన మలయాళ నిర్మాతల మలయాళ సినిమాలను ఇక ప్రదర్శించము అని నిర్ణయం తీసుకోవడమే కాక ఆ సినిమాలన్నింటినీ నిలిపివేసింది. అంతేకాదు మలయాళ నుంచి ఇతర భాషల్లోకి డబ్బింగ్ అయిన సినిమాలను కూడా ప్రదర్శించకూడదని ఆ భాషల సినిమాలను కూడా షోలు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. కేరళ నిర్మాతలు ఆ మాండేట్ ఎత్తివేసే వరకు పివిఆర్ -ఐనాక్స్ సంస్థ మలయాళ సినిమాలు వేటినీ తమ ధియేటర్లలో ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు వెళుతుంది? అనేది తెలియాల్సి ఉంది.