hema will be Evicted from MAA Membership Says Karate Kalyani: ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన హేమతో పాటు ఆషి రాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో లేరు కానీ ఇప్పుడు పోలీసులు వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్స్ ట్రెసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది.
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు.. చెట్ల కిందే డ్రగ్స్?
అయితే తాజాగా.. ఈ కేసుపై ప్రముఖ నటి కరాటే కల్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు నమోదు కావడం బాధాకరం ఐ పేర్కొన్న ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన హేమ ‘మా అసోసియేషన్’ సభ్యత్వాన్ని తొలగిస్తామని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫ్రాన్స్‌లో ఉన్నారని, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో కన్నప్ప చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారని చెప్పారు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కరాటే కళ్యాణి వెల్లడించారు. ఇక ఈ రేవ్ పార్టీ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో జరగగా పార్టీని ఆర్గనైజ్ చేసింది A2 అరుణ్ కుమార్. A4 రణధీర్ కారులో డ్రగ్స్ లభ్యం అయ్యాయి.