Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు.. చెట్ల కిందే డ్రగ్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangalore Rave Party Drugs Case latest FIR : బెంగళూరు రేవ్ పార్టీ మాడిఫై చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో రేవ్ పార్టీ పై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు 11:30 కి ఫామ్ హౌస్ కి పోలీసులు చేరుకున్నారు. ఇక పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీ లోని ఫామ్ హౌజ్ లో 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ జరిగింది. మత్తు పదార్థాలను విక్రయిస్తూ.. సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందని, వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్నామని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ జరుగుతుండగా రైడ్ చేశామని ఆ సమయంలో కొంతమంది డాన్స్ చేస్తున్నారు.
కొందరు ఫామ్ హౌజ్ చెట్ల మధ్య లో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎండీఎంఏ పిల్స్, కొకైన్, హైడోగాంజా వంటి డ్రగ్స్ అక్కడ లభించాయని పేర్కొన్నారు. నిందితుడు A-1 వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్.. A6 గోపాల్ రెడ్డిని సంప్రదించి పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడు. గోపాల్ రెడ్డి తన GR ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకోమని చెప్పడంతో.. A2 అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లను చూసుకున్నాడు. నాగబాబు, రణధీర్ బాబు ఈ పార్టీ కోసం డ్రగ్స్ ఆరెంజ్ చేశారు. ఎండీఎంఏ ఏక్, టీసీ, పిల్స్, ఎండీఎంఏ క్రిస్టల్, కొకైన్, హైడోగంజా వంటి డ్రగ్స్ ఈ పార్టీకి తీసుకొచ్చారని ఎఫ్ఐఆర్ లో ఉంది.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇక పార్టీకి పలువురు ప్రముఖులను ఆహ్వానం అందించారని, అలా వచ్చిన అందరికీ డ్రగ్స్ తీసుకోమని వాసు చెప్పినట్టు పేర్కొన్నారు. ఆ అనంతరం కొందరు నేరుగా.. మరికొందరు 500 నోటు తో కొకైన్ తీసుకున్నట్లు గుర్తించాం, రణధీర్ బాబు కారులో కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం, పులికేశినగర్ లోని సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ లో డ్రగ్ టెస్టులు చేశాం. అందులో 68 మంది యువకులు, 30 మంది యువకులకు పాజిటివ్ వచ్చింది. నిందితులపై 242/2024, 290, 294 .. & 8(c), 22(b), 22(c), 22(A), 27 (B), 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!