Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి హీరోగా ‘మెగా’.. అదరగొట్టేశాడు అంతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి డబ్బును వెదజల్లుతూ కనిపిస్తాడు. ఇంకోపక్క యూట్యూబ్ లో రిచ్ లైఫ్ గడుపుతూ కనిపిస్తాడు. అసలు నిజంగా హర్షసాయికి అంత డబ్బు వస్తుందా..? అతను చేసే మంచి పనులు నిజమేనా..? అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇక అప్పటి విషయం పక్కన పెడితే.. తాజాగా హర్షసాయి హీరోగా అవతారమెత్తాడు. మెగా లో డాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది కూడా హర్షసాయినే. ఇక ఈ చిత్రాన్ని బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ” ఏంటి డాక్టర్? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగ్గా.. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి” అంటూ డాక్టర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఒక గంట కింద హీరో హర్షసాయిని తాళ్లతో కట్టేసి పైకి లాగి చంపాడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. బాలయ్య సినిమా క్యాన్సిల్..?
Also Read
- Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
ఇక ఆ సమయంలోనే హర్షసాయి కళ్ళు తెరిచి.. ” జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే .. నిజమైన ఓటమి.. రేయ్ ఒకటి చెప్పు .. నేను ఓటమిని ఒప్పుకొనేవాడిలా కనిపిస్తున్నానా.. ? చావు గురుంచి మాట్లాడుతున్నావ్ గా.. అసలు చావు అంటే ఏమిటి..? ” అని అనగానే పై నుంచి ఒక దెయ్యంను చూపించారు. అంటే ఇదేదో హర్రర్ కథగా కనిపిస్తుంది. ఇక ఇంకోపక్క డాక్టర్ .. ఒక జంతువు బలం అది కొరికినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని బట్టి నిర్దారణ అవుతుంది.. అంటూ డైనోసర్ తో హీరోను పోలుస్తాడు.. అసలు హీరో ఎవరు..? ఈ కథ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో హర్షసాయి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!