Haromhara: యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హరోంహర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. సుధీర్ సరసన మాళవిక శర్మ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ను పాన్ ఇండియా స్టార్ల చేత రిలీజ్ చేయించారు. కన్నడ లో సుదీప్, మలయాళంలో మమ్ముట్టి, తమిళ్ లో విజయ్ సేతుపతి రిలీజ్ చేయగా.. తెలుగులో డార్లింగ్ ప్రభాస్.. టీజర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మరోసారి సుధీర్ బాబు మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది.
Ranbir Kapoor : లైవ్ లో కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన స్టార్ హీరో.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
” అందరూ .. పవర్ కోసం గన్ పట్టుకుంటారు.. కానీ, ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది” అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. సైలెంట్ గా ఉండే హీరో జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన హీరో లీడర్ గా ఎలా మారాడు.. అనేది కథగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు.ఏంటి . ? సుబ్రహ్మణ్యం పవర్ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్ లీడర్ గా సుధీర్ బాబు లుక్ ఆకట్టుకుంటుంది. చివర్లో ” వాడు సమరమే మొదలుపెడితే.. ఆ సంభవానికి సంతకం నాది అవుతాది” అని సుధీర్ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.