HHVM : హరిహర వీరమల్లు సినిమాపై చాలా రకాల అనుమానాలు మొన్నటి దాకా వినిపించాయి. మూవీ మొదలై ఐదేళ్లు అయింది.. మధ్యలోనే క్రిష్ వెళ్లిపోయాడు. సినిమా సీన్లు బాగా రాలేదని పవన్ అసంతృప్తిగా ఉన్నాడంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అరకొరగా షూటింగ్ జరిగిందని టాక్. మధ్యలో అనుభవం లేని జ్యోతికృష్ణ ఎంట్రీతో ఏదో చేయాలని చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. పైగా వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా మైనస్ పాయింట్. పైగా పవన్ కూడా ఈ సినిమా గురించి ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అటు ఫ్యాన్స్ లో ఇటు సాధారణ ప్రేక్షకుల్లో దీనిపై రకరకాల అనుమానాలు పెరిగిపోయాయి.
Read Also : HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
వాటన్నింటికీ ఒక్క ట్రైలర్ తోనే సమాధానాలు దొరికేసినట్టు అయింది. మూవీ ట్రైలర్ అనుకున్నదానికంటే బాగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు, పోస్టర్లలో ఈ స్థాయి విజువల్స్ కనిపించలేదు. కానీ ట్రైలర్ తోనే అసలు తమ సినిమా ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా హైప్ పెంచేశారు. ఈ విషయంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. అందులో నో డౌట్. హరిహర వీరమల్లు మూవీ ఒక ధర్మవీరుడి కథ అని ట్రైలర్ తో చెప్పడమే కాకుండా.. ధర్మం కోసం ఏ స్థాయిలో పోరాడాడో చూపించారు. యాక్షన్ సీన్లు, విజువల్స్, వీఎఫ్ ఎక్స్ అదిరిపోయాయి. దెబ్బకు 24 గంటల్లోనే భారీ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాను ఊపేసింది. మొన్నటి వరకు ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే రిజల్ట్ మూవీ రిలీజ్ రోజు ఉంటే మాత్రం కలెక్షన్ల వరద పారుతుందనే చెప్పుకోవాలి.
Read Also : Allu Aravind : అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం..