HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీ కోసం భారీగా ప్రీమియర్స్ షోలు వేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. మూవీ టికెట్ రేట్లపై కొంత నెగెటివిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం రేట్లు తగ్గించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ రేట్లను తగ్గించేందుకు మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన టికెట్ రేట్లు సోమవారం నుంచే అందుబాటులోకి రానున్నాయి.
Read Also : Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
జులై 28 నుంచి రేట్లు తగ్గిన టికెట్లు థియేటర్లలో అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే బుక్‌మై షో, డిస్ట్రిక్ యాప్‌లలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మూవీని మరింత మందికి చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభించనున్నాయి. దీంతో మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉండబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు టికెట్ రేట్లుఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది పవన్ ఫ్యాన్స్ కూడా సినిమాకు వెళ్లలేని పరిస్థితి ఉండేది.
Read Also : Varun Sandesh : వరుణ్ సందేశ్ కొత్త మూవీ స్టార్ట్..