Mothevari Love Story : ఓటీటీ సంస్థ జీ5 స్వయంగా తీస్తున్న తాజా సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా సిరీస్ ట్రైలర్ ను తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘ఇగో ఇదే మా ఊరు.. ఆరె పల్లి.. ఊరుఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగింది.
Read Also : HHVM : పురాణాల ఆధారంగా పవన్ పాత్ర.. జ్యోతికృష్ణ క్లారిటీ
అనిల్ పాత్ర పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్ ట్రాక్, ఊర్లోని పెద్దలు, భూ సమస్య, ప్రేమ లాంటి విలేజ్ బేస్డ్ పాయింట్లతో ఎంటర్ టైనింగ్ గా అనిపించే విధంగా దీన్ని రూపొందించారు. ఆ సీన్లు ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘అమ్మాయిలు భలేగా ఉంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ చెప్తరే’ అంటూ సాగే డైలాగ్ ఇందులో ఉన్న ఎమోషనల్ సీన్ ను గుర్తు చేస్తోంది. ఈ సిరీస్ కు అర్జున్ మ్యూజిక్ అందించారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మించారు.
Read Also : Naga Chaithanya : ఇద్దరు పిల్లలు కావాలి.. ఇష్టాలను బయటపెట్టిన నాగచైతన్య