Akshay Kumar : అక్షయ్ కుమార్ అంటే దేశ వ్యాప్తంగా మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు. పాత్రల కోసం ఎంతో కష్టపడుతాడు అనే పేరుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయన స్పెషాలిటీ. అలాంటి అక్షయ్ కుమార్.. చేసిన కన్నప్ప సినిమాలో మోసం చేశాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో నటించాడు అక్షయ్. ఈ పాత్రను రెండు సార్లు రిజెక్ట్ చేశాడు అక్షయ్. కానీ విష్ణు ఎలాగోలా ఒప్పించి చేపించాడు. అయితే ఈ పాత్ర కోసం అక్షయ్ పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదని తెలుస్తోంది. ఏదో బలవంతం మీద చేశాడు కాబట్టి.. ఈ పాత్ర డైలాగులను ప్రాంప్టర్ లో చూసి చెప్పాడంట.
Read Also : Dhanush : కాలిపోతున్న పత్తిపంట.. ధనుష్ మరో సంచలన మూవీ..
సినిమాలో పాత్ర డైలాగులు అంటే కచ్చితంగా నేర్చుకుని చెప్పాల్సిందే. కానీ అక్షయ్ కుమార్ మాత్రం ఈ సినిమాలోని శివుడి పాత్ర డైలాగులను టెలిప్రాంపర్టర్ ను చూసి చెప్పినట్టు కనిపిస్తోంది. ఆయన కనిపించే సీన్స్ లో తన కళ్లను పక్కకు తిప్పడాన్ని బట్టి ఈజీగా అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆయన్ను తిట్టి పోస్తున్నారు. పవిత్రమైన శివుడి పాత్ర చేస్తూ కనీసం డైలాగులు నేర్చుకోలేవా అంటూ తిట్టిపోస్తున్నారు. ఎంత ఇష్టం లేకపోయినా.. శివుడి పాత్రకు అయినా గౌరవం ఇవ్వాలి కదా అంటున్నారు నెటిజన్లు. మరీ ఇంత అవసరమా అంటూ ఏకి పారేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
Read Also : Baahubali : బాహుబలిని ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..?