Hanuman: ఎట్టకేలకు హనుమాన్ ప్రివ్యూలు పడిపోయాయి. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. హనుమాన్ అని పేరు వింటేనే ఊగిపోతాం.. అలాంటిది ఆయన సినిమా అయితే వెళ్లకుండా ఉంటామా అని అభిమానులు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇక హనుమాన్ రివ్యూలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మరోసారి హిట్ కొట్టాడని చెప్పకనే చెప్పుకొస్తున్నారు. థియేటర్ అంతా హనుమాన్ అరుపులతో మారుమ్రోగిపోతుంది. ఇక ప్రశాంత్ వర్మ.. సినిమా మొత్తాన్ని భక్తిగా కాకుండా కమర్షియల్ గా తీయడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమా హీరోల స్పూఫ్స్ తో చేసిన సీన్స్ అయితే హైలైట్ గా మారాయి. ప్రతి హీరో ఫ్యాన్స్.. తమ హీరోను గుర్తుచేసుకోవడం ఖాయం. ఇక ఈ సినిమాలో ఒక హీరో కాదు ఇద్దరు హీరోలు కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోల రిఫరెన్స్ లు మొత్తాన్ని ప్రశాంత్ చూపించేశాడు.
తేజకు హనుమాన్ పవర్స్ వస్తాయి. కానీ, అతనికి పవర్స్ రావడం ఏంటి అని ఫ్రెండ్స్ నమ్మరు. వారిని నమ్మించడానికి ఏం చేయాలో చెప్పమని అడుగగా.. తేజ ఫ్రెండ్స్.. బాహుబలి చిత్రంలో ప్రభాస్ లా శివలింగాన్ని ఎత్తుతాడు. జల్సాలో పవన్ చేసినట్లు కత్తిని అమాంతం నేలలోకి దించుతాడు. అల్లు అర్జున్ ఆర్య సినిమాలో వాటర్ పంప్ ను ఎత్తినట్లు ఎత్తుతాడు.అతడులో మహేష్ లా గోడను చేత్తో బద్దలు కొడతాడు. ఇవన్నీ తనకు హనుమాన్ పవర్స్ వలన వచ్చాయని చేసి చూపిస్తాడు. అయితే ఫ్రెండ్స్ మాత్రం.. వారందరూ హీరోలు మాత్రమే.. మా బాలయ్య సూపర్ హీరో.. ఆయన చేసినట్లు తొడగొట్టి ట్రైన్ ను వెనక్కి పంపు అని అడగ్గా.. హీరో.. ట్రైన్ ఎదురుగా నిలబడి తొడగొడతాడు. ట్రైన్ ఆగకుండా.. హీరో మీదనుంచి దూసుకుపోతుంది. అయినా హీరోకు ఏమి కాకపోవడంతో అందరూ హీరోను నమ్మడం మొదలుపెడతారు. ఈ పర్టికులర్ సీక్వెన్స్ కు థియేటర్ లో ఈలలు మాములుగా లేవు. ఈ హీరోల గురించే కాకుండా తేజ.. ఇంద్ర సినిమాలో నేనున్నా నాయనమ్మ సీన్ ను కూడా రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రివ్యూ రివ్యూలు పాజిటివ్ టాక్ ను అందుకుంటున్నాయి. మరి రేపు సినిమా ఎలాంటి కలక్షన్స్ అందుకుంటాయో చూడాలి.