Hanuman Premieres gets a Tremendous Response: హనుమాన్ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పాన్-ఇండియన్ సినిమాగా వస్తున్న హనుమాన్ సినిమా ప్రేక్షకులలో ఊహించని క్రేజ్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. హనుమాన్ ప్రీమియర్స్ అద్భుతమైన హిట్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాని మొదట లిమిటెడ్ షోస్ ప్రదర్శించాలని ప్లాన్ చేసి నిన్న సాయంత్రం వైజాగ్, హైదరాబాద్ లలో షోలు ఓపెన్ చేశారు. అద్భుతమైన డిమాండ్ కారణంగా , ఈ షోలను ఇంకా ఇంకా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ క్రమంలో టీమ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల్లో, సీ అండ్ డీ సెంటర్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తోంది. అన్ని ప్రధాన నగరాల్లో హనుమాన్ షోలు సాయంత్రం 6:30 మరియు రాత్రి 9:30 గంటలకు ప్రదర్శించబడతాయి. జనవరి 11న సినిమాలేవీ విడుదల కానందున, సినిమా చాలా స్క్రీన్లు – షోలను దక్కించుకుంటోది. ఈ ప్రీమియర్ స్ట్రాటజీ నిర్మాతలు, కొనుగోలుదారులకు బాగా వర్కౌట్ అవుతోంది.
SS Thaman: ‘కుర్చీ మడత’ పెట్టాడని ‘థమన్’ని ఎన్ని తిట్టుకున్నారో పాపం!
ఇలా చేయడం మొదటి రోజు వసూళ్లను కవర్ చేస్తున్నట్టు అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం మొదటి రోజు స్క్రీన్ సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. AP/TGలో ఏ సినిమా కోసం ఇన్ని ప్రీమియర్ షోల సంఖ్యను ఎన్నడూ వినలేదు, మల్టీప్లెక్స్‌ల నుండి B, C సెంటర్‌ల వరకు ప్రీమియర్‌లు జనవరి 11న షెడ్యూల్ చేయబడ్డాయి. బుక్ మై షోలో ఇప్పటివరకు దాదాపు 250 షోలు ఓపెన్ అవగా అందులోకి 200+ షోలు ఇప్పటికే సోల్డౌట్‌లో ఉన్నాయి. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్‌దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. హనుమాన్ చిత్రంలో, తేజ సజ్జ హనుమంతుడి వలన అసాధారణ శక్తులను పొందే యువకుడి పాత్రను పోషించాడు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2024న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ వంటి పలు భాషల్లో హనుమాన్ విడుదల కానుంది.