SS Thaman: ‘కుర్చీ మడత’ పెట్టాడని ‘థమన్’ని ఎన్ని తిట్టుకున్నారో పాపం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Revealed the facts behind Kurchi Madatha Petti Song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన మేకర్స్ నాలుగో పాటను రిలీజ్ చేశారు. అయితే కుర్చీ మడతపెట్టి సాంగ్ గురించి ఆ పాత ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. గతంలో సోషల్ మీడియాలో ఒక ముసలాయన ఉపయోగించిన కుర్చీ మడత పెట్టి అనే బూతులతో కూడిన డైలాగ్ తో రకరకాల డీజే మిక్స్ లు వచ్చాయి. ఇప్పుడు అదే డైలాగ్ ను మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా సాంగ్ లో పెట్టడం పెద్ద హాట్ టాపిక్ అయింది.
అసలు మహేష్ కి ఇలాంటి సాంగ్ పెట్టడం ఏంటి? అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై, త్రివిక్రమ్ పై ఫ్యాన్స్, నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయితే ఈ పాటలో కుర్చీ మడత పెట్టి డైలాగ్ యూజ్ చేసినందుకు ఆ ముసలాయనకు థమన్ స్వయంగా డబ్బులు కూడా ఇచ్చాడని తేలడంతో ఈ పాట ఐడియా తమన్ దే అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే హీరో మహేశ్ బాబు ఈ సాంగ్ గురించి కోసం మాట్లాడుతూ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఐడియా.. తమన్ ది కాదని తనది, త్రివికమ్ దని చెప్పుకొచ్చాడు. “ఈ సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి చేస్తావా అని నేను, త్రివిక్రమ్ గారు అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు. వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు. థమన్ అలా చేయలేదు. రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయి” అని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక అలా మహేష్ క్లారిటీ అవ్వడంతో పాపం థమన్ ను ఎన్ని తిట్టుకున్నార్రా మహేష్ ఫాన్స్ అని అంటున్నారు నెటిజన్లు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు