Hanuman Movie Release Date: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హనుమాన్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సజ్జా తేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, అశ్రీన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ రేపు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడింది.
Pawan Kalyan: ప్రభాస్ అభిమానులకు పవన్ సారీ.. చేతులెత్తి వేడుకుంటున్నాను అంటూ!
అయితే సినిమా కొత్త రిలీజ్ డేట్ రేపు అనౌన్స్ చేస్తామని ఉదయం 10.8 నిమిషాలకు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు సమ్మర్ కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రేపు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.