Guntur Kaaram: మమ్మల్ని క్షమించండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జనవరి 12 న సంక్రాంతి రేసులో గుంటూరు కారం దిగుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రోజుకో మాస్ పోస్టర్ తో అలరిస్తున్నారు. ఇంకోపక్క ఈ సినిమా ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. జనవరి 6 న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ తో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే.. చివరి నిమిషంలో ఫ్యాన్స్ కు మేకర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిందని అధికారికంగా తెలిపారు.
“మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, ఊహించని పరిస్థితులు మరియు భద్రతా అనుమతుల సమస్యల కారణంగా, మేము 6 జనవరి 2024న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడం లేదు. ఇందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. మరో కొత్త వేదికతో కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం” అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. మరి కొత్త డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
Also Read
Despite our best efforts, due to unforeseen circumstances and issues with security permissions, we will not be conducting the highly awaited #GunturKaaram Pre-release event on 6th January 2024. We sincerely apologize for this announcement 💔
The new date for the event with the…
— Haarika & Hassine Creations (@haarikahassine) January 5, 2024
తాజావార్తలు
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..