Gunasekhar : వైవిధ్యమే గుణశేఖరుని ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేరుకు తగ్గట్టే గుణశేఖర్ ఓ ప్రత్యేకమైన గుణమున్న దర్శకుడు. సక్సెస్ కోసం పరుగులు తీయరు. అలాగని కమర్షియల్ ఫార్ములానూ వీడరు. చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్.
గుణశేఖర్ 1964 జూన్ 2న అనకాపల్లి సమీపంలోని నర్సీపట్నంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చెన్నపట్నం చేరారు. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి వారి వద్ద అసోసియేట్ గా పనిచేశారు గుణశేఖర్. తొలి చిత్రం ‘లాఠీ’తోనే దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారు. రెండో సినిమా ‘సొగసు చూడతరమా’తోనూ ఆకట్టుకోగలిగారు. మూడో చిత్రం ‘రామాయణం’లో అందరూ బాలలతో ఓ ప్రయోగం చేశారు. అందుకు నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి సాహసం కూడా తోడయింది. ఆ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
మూడు చిత్రాలతోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్న గుణశేఖర్ కు చిరంజీవి ‘చూడాలనివుంది’ అసలు సిసలు ఘనవిజయాన్ని చూపించింది. తరువాత కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ‘మనోహరం’ మనసులను అంతగా హరించలేకపోయింది. ‘మృగరాజు’ సరిగా గర్జించలేకపోయాడు. అప్పుడు మహేశ్ తో ‘ఒక్కడు’ తీసి మురిపించారు గుణశేఖర్. మహేశ్ కెరీర్ లో ‘ఒక్కడు’ తొలి గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఆ నమ్మకంతోనే గుణశేఖర్ తో ‘అర్జున్’గానూ, ‘సైనికుడు’గానూ సాగారు మహేశ్. అయితే అవి ‘ఒక్కడు’లా మురిపించలేకపోయాయి. ‘వరుడు’ వివాహమహోత్సం చూపించాడే కానీ, విజయోత్సవం కలిగించలేకపోయాడు. తరువాత ‘నిప్పు’ అని తెలిసీ పట్టుకుంటే కాలింది. ‘రుద్రమదేవి’కి అసలు సిసలు బంగారు ఆభరణాలు అలంకరించారు గుణశేఖర్. ఈ చారిత్రకం ఆయనకు ఏ మాత్రం లాభించలేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత ఇప్పుడు ‘శాకుంతలం’ అనే పౌరాణికంపై దృష్టి సారించారు గుణశేఖర్. సమంత శకుంతలగా నటిస్తోన్న ‘శాకుంతలం’పై గుణశేఖర్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఆ తరువాత రానాతో ‘హిరణ్య కశ్యప’ కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రం ‘రామాయణం’తో నేషనల్ అవార్డు సంపాదించిన గుణశేఖర్ మళ్ళీ ఇన్నాళ్ళకు పౌరాణికాలపైనే దృష్టి సారిస్తున్నారంటే ఆయన ఏదో చెయ్యబోతున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారయినా గుణశేఖర్ కోరుకుంటున్న విజయం ఆయన దరి చేరాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!