Tribute: ప్రతాప్ పోతన్కు నివాళి అర్పించిన ‘గ్రే’ మూవీ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతాప్ పోతన్ అనగానే నటుడిగా అందరికీ గుర్తొచ్చే చిత్రం ‘ఆకలి రాజ్యం’, అలానే దర్శకుడిగా ‘చైతన్య’. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రతాప్ పోతన్ తెలుగులో చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గ్రే’ సినిమాలో నటించారు. దానికి దర్శకుడు రాజ్ మాదిరాజు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ హఠాన్మరణం ఆ చిత్ర బృందాన్ని షాక్ కు గురి చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్రే సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ‘రాజ్… నా కోసం ఓ మంచి కథ తయారు చేయండి. నేను ఫ్రీగా నటిస్తాను’ అని ప్రతాప్ పోతన్ చెప్పిన మాటను ఈ సందర్భంగా రాజ్ మాదిరాజు గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ప్రతాప్ పోతన్ కు తన మాటలతో రాజ్ మాదిరాజు ఇలా నివాళి అర్పించారు.
‘ప్రతాప్ పోతన్ మా జనరేషన్ సినిమా ఆడియెన్సుకి, ముఖ్యంగా సినిమా పిచ్చోళ్ళకి బాగా తెలిసిన నటుడు. ఒక విధమైన క్రేజీ ఎక్సెంట్రిక్ సైకోటిక్ ప్రవర్తన ఉన్న పాత్రలలో భలే ఇమిడిపోయేవాడు. ‘గ్రే’ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర రాసుకుంటూండగా ఆయనే మొదట మెదిలింది. ఆయననే ఎదురుగా పెట్టుకుని రాసుకుని పూర్తి కాగానే ఆయనకు ఫోనులో వినిపించాను. చాలా ఇష్టపడ్డారాయన. తన పాత్రని, సినిమాని, నా టీమ్ ని, తన సహ నటీనటులను! స్వతహాగా దర్శకుడు కూడా అవడంతో సెట్లో లెన్సు, లైటింగు గురించి మాట్లాడేవారు. పోట్లాడేవారు. ఎదురు చెప్పబోతే ఈసడించుకునేవారు. ఈర్ష్యపడేవారు. పూర్తయాక చూసి సరేలే అని వెళ్ళిపోయేవారు. ఉదయం ఆరున్నరకి లొకేషనుకొస్తే ప్యాకప్ అయేంతవరకూ అలాగే కూర్చుని ఉండేవారు. ఒకరోజు దాదాపు ముఫ్ఫయ్యారు గంటలు నాన్-స్టాప్ షూటింగు చేశాం.. ఆయన బట్టలనిండా, ఒంటినిండా రక్తం పెట్టుకుని ఆరిపోతోంటే మళ్ళీ మళ్ళీ తడిచేసుకుంటూ అలాగే ఉన్నారు. తిరిగి వెళ్ళిపోయాక సినిమా, ట్రైలర్ రెండూ పంపించాను. ‘నీ చేతిలో ఒక జెమ్ ఉంది రాజ్.. జాగ్రత్తగా ప్రమోషన్ చేయండి’ అని డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండాలో పది పన్నెండు ఐడియాలు చెప్పారు. 70 ఏళ్ల వయసులో ఆయన ఉత్సాహం, కమిట్మెంటు చూస్తే గొప్పగా అనిపించింది.
Pratap Sir.. Team ‘Grey’ misses you.. Can’t believe ‘Grey’ is your last film.. We love you”!!
Also Read

తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..