బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదే రానుందని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ కూడా గణతంత్ర దినోత్సవానికి దగ్గరగా ఉండటంతో ఆరోజును రాజమౌళి ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాగా ఈ విడుదల తేదీ అనౌన్స్ మెంట్ ను ఆగస్టు 15న ప్లాన్ చేసినట్లు సమాచారం. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా విడుదల తేదీ ప్రకటన రానుందని బలమైన సమాచారం అందుతోంది.