Megastar Chiranjeevi asks VV Vinayak to Assist Vassishta for Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపుగా షూట్ పూర్తి చేసుకోవచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ తేజ, శంకర్ కాంబినేషన్ సినిమా కోసం విశ్వంభర టీం త్యాగం చేసి ఆ సంక్రాంతి డేట్ ని రామ్ చరణ్ కి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మరో కొత్త సమాచారం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మొన్న దసరా రోజున రిలీజ్ చేశారు. అయితే టీజర్ బాగుందని చాలామంది కామెంట్ చేస్తుంటే విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉందని ఒక వర్గం కామెంట్స్ చేస్తోంది.. ఇక ఇప్పుడు ఇదే విషయం మీద మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ పర్యవేక్షించే బాధ్యతలు ఒక సీనియర్ డైరెక్టర్ కి ఆయన అప్పగించారని తెలుస్తోంది.
Unstoppable 4 : బాలయ్య విత్ సీఎం అండ్ డిప్యూటీ.. రికార్డులూ ఊపిరి పీల్చుకోండి
ఈ మధ్యనే వివి వినాయక్ పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి వెళ్లి వినాయక్ కి విషెస్ తెలిపారు. అదే రోజున ఆయన విశ్వంభరా కోసం విఎఫ్ఎక్స్ సూపర్వైజ్ చేయాల్సిందిగా వివి వినాయక్ ని కోరినట్లు తెలుస్తోంది. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన బన్నీ సినిమాని వశిష్ట తండ్రి సత్యనారాయణ నిర్మించారు. అప్పటి నుంచే వశిష్టతో కూడా వివి వినాయక్ కి మంచి రాపో ఉంది. వీఎఫ్ఎక్స్ విషయంలో అలాగే మిగతా కొన్ని కీలకమైన విషయాల్లో వశిష్టకి సహాయం చేయాల్సిందిగా చిరంజీవి కోరినట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి సినిమాకి దర్శకుడు కాకపోయినా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం వినాయక్ కి ఇది మొదటిసారి కాదు. స్టాలిన్ సమయంలో కూడా మురుగదాస్ కోసం వినాయక్ కొన్ని సీన్స్ షూట్ చేసి పెట్టారు..ఇప్పుడు కూడా విశ్వంభరా కోసం వివి వినాయక్ రంగంలోకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ తరువాత ఈ నిర్ణయం జరగలేదని టాక్. వినాయక్ మొన్ననే అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ టీజర్ రిలీజ్ కంటే ముందే మెగాస్టార్ కలిశారు. వినాయక్ ను వశిష్టకి సాయం చేయమని అడిగి ఉండొచ్చు కానీ అది టీజర్ ను చూసి కాదని అంటున్నారు.