విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించిన 'కథ వెనుక కథ' ఇదే నెలలో జనం ముందుకు రాబోతోంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ చెందిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య తెరకెక్కించాడు.
కృష్ణచైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ నిర్మించిన 'కథ వెనుక కథ' టీజర్ ను ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ థీమ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
కార్తీక్ రాజు హీరోగా మరో కొత్త సినిమా మొదలైంది. త్వరిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో అంజీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.