గోపీచంద్ సినిమా హిట్టు కొట్టి చాలా కాలం అయితే అయ్యింది. సినిమా బాగుంది అని టాక్ వినోపించే లోపే ప్లాప్ టాక్ వినిపిస్తుంది.ఎందుకంటే గోపీచంద్ సినిమా కు అంతగా హైప్ లేకపోవడం వల్లే అని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ హీరో ల్లో చాలా మంది ఇమేజ్ ను పక్కన పెట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ కూడా ‘బింబిసార’ వంటి సబ్జెక్ట్ ను తనే నిర్మించి మరీ తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. అందులో అతను పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుంది.
అంతేకాదు ‘కార్తికేయ 2 ‘ లో నిఖిల్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆ సినిమా తో ఏకం గా పాన్ ఇండియా హీరో అయిపోయాడు నిఖిల్ . వీళ్ళు మాత్రమే కాదు టాలీవుడ్లో చాలా మంది హీరోలు కూడా అలానే చేస్తున్నారు. కానీ గోపీచంద్ మాత్రం ఇంకా పాత కథల తోనే సినిమాలు చేస్తూ తన అభిమానుల ను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ‘రామబాణం’ సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లో ఆడలేదు అంటే అదే అస్సలు కారణం.అందుకే గోపీచంద్ ఇప్పుడు రూటు మార్చాడని తెలుస్తుంది.తన తరువాత సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు..ఆ సినిమా పేరు ‘భీమా’. కన్నడ లో పలు హిట్లు అందించాడు దర్శకుడు హర్ష.హర్ష తెరకెక్కించే ఈ సినిమా నుండి ఒక ఓ పోస్టర్ ను కూడా వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇదిలా ఉండగా.ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం లో గోపీచంద్ ఓ సినిమా చేస్తాను అని ఎప్పుడో చెప్పాడు. కానీ రామబాణం ఫలితం తో గోపీచంద్ మనసు మార్చుకున్నట్టు అయితే తెలుస్తుంది. ‘భీమా’ ఫలితాన్ని బట్టి ఆ ప్రాజెక్టు చేయాలా వద్ద అనేది గోపీచంద్ నిర్ణయించుకుంటాడని సమాచారం.గోపిచంద్ ఛాలెంజింగ్ పాత్రలు చేస్తే చాలా బాగుంటుంది ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.