Google Doodle: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పండగ ఈ రోజు ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 97 కోట్ల ఓటర్లను కలిగిన అతిపెద్ద ఎన్నికలుగా ఈ ఎన్నికలు చెప్పబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
Read Also: Bear in Kamareddy: కామారెడ్డిలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు గుర్తుగా గూగుల్ శుక్రవారం డూడుల్‌ని రిలీజ్ చేసింది. ఎన్నికల చిహ్నంతో ఈ డూడుల్‌ని రూపొందించింది. దీనిని క్లిక్ చేసిన వెంటనే యూజర్లకు భారతదేశ ఎన్నికల తాజా అప్‌డేట్స్‌ని అందిస్తుంది. సిరా కలిగిన చూపుడు వేలు చిహ్నాన్ని కలిగి ఉంది. గూగుల్ డూడుల్ డిజైనర్ పేరును వెల్లడించలేదు
18వ లోక్‌సభ ఎన్నికల కోసం ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మొదటి దశలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, సంజీవ్ బలియన్, జితేంద్ర ప్రధాన అభ్యర్థులు ఉన్నారు. సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు సర్బానంద సోనోవాల్ వంటి కేంద్రమంత్రులు బరిలో ఉన్నారు. 2019లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45 సీట్లు గెలుచుకుంటే, ఎన్డీయే 41 సీట్లను సాధించింది.