మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. మలయాళంలోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో ఇంత బిజీ హీరో మరెక్కడా ఉండడు.. ఒక్క ఏడాదిలోనే ఈ హీరో 20 సినిమాలకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్ లో ఉండనున్నదట.. అందులో కొన్ని సినిమాలకు ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం.. ఇక ఇటీవలే ‘బ్రో డాడీ’ చిత్రంతో ఓటిటీ లో సందడి చేసిన పృథ్విరాజ్ రెండు రోజుల క్రితమే ‘జనగణమణ’ తో మరోసారి హంగామా మొదలుపెట్టాడు.. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటీ లో భారీ విజయాన్ని అందుకొని ప్రేక్షకులను మెప్పిస్తుంది.. ఇక ఈ రెండు సినిమాలు విజయం అందుకోవడంతో ఈ హీరో జోరు పెంచేశాడు. వెంటనే తన కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేశాడు.
‘ప్రేమమ్’ చిత్రంతో ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న చిత్రం ‘గోల్డ్’. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. చుట్టూ మనుషులతో మధ్యలో నయన్ అయోమయంగా చూస్తుండగా, పృథ్విరాజ్ సుకుమారన్ ఫోన్ మాట్లాడుతూ నవ్వుతు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో ప్రేమమ్ దర్శకుడు మరో ప్రేమమ్ ను చూపిస్తాడో లేదో చూడాలి.