మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఆఖరి నిమిషంలో సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి.
Read Also : F.I.R: తలసానికి ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీపై మజ్లీస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘గని’లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి ఎం మంజ్రేకర్ వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘గని’ తెరకెక్కుతోంది. సంగీతం తమన్ అందించారు.
Censor done!🥊
— Varun Tej Konidela (@IAmVarunTej) February 11, 2022
See you in theatres real soon!🙌🏽#Ghani pic.twitter.com/0tlPa21ozZ