జబర్దస్త్ ద్వారా ఊహించని క్రేజ్ సంపాదించి, ప్రస్తుతం వెండితెరపై నటుడిగా రాణిస్తున్న గెటప్ శ్రీను, సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూయర్ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో రివ్యూల పేరుతో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, హేళనలపై ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ.. భవిష్యత్తులో రివ్యూలు ఎంత విడ్డూరంగా మారబోతున్నాయో ఉదాహరణలతో వివరించారు. సినిమా రివ్యూలు అనేవి ఒక కళాఖండాన్ని గౌరవించేలా ఉండాలి తప్ప, కించపరిచేలా ఉండకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Dhurandhar: బాక్సాఫిస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రాయల్ ఎంట్రీ!
రివ్యూయర్లకు గెటప్ శ్రీను సూచించిన 11 కీలక సూత్రాలు
* నిర్ణయం తీసుకోవడంలో సహాయపడాలి: ఒక రివ్యూ చూసిన తర్వాత ప్రేక్షకుడు ఆ సినిమా చూడాలా వద్దా అనే విషయంలో స్పష్టత వచ్చేలా ఉండాలి.
* స్పాయిలర్స్ వద్దు: కథలోని కీలక మలుపులను రివ్యూలో చెప్పేసి ప్రేక్షకుల ఉత్సాహాన్ని నీరుగార్చద్దు.
* వ్యక్తిగత ద్వేషం వద్దు: దర్శకుడి పనితీరును విశ్లేషించేటప్పుడు వ్యక్తిగత కోపతాపాలకు తావు ఉండద్దు.
* కష్టాన్ని గుర్తించాలి: నటీనటులు, సాంకేతిక నిపుణులు పడే కష్టాన్ని నిజాయితీగా అభినందించేలా ఉండాలి.
* నిలకడైన విశ్లేషణ: సినిమాలో లోపాలున్నా, ప్లస్ పాయింట్స్ ఉన్నా వాటిని సంయమనంతో వివరించేలా ఉండాలి.
* నెగటివిటీ వద్దు: కేవలం వ్యూస్ కోసమో, అటెన్షన్ కోసమో నెగటివ్ థంబ్‌నైల్స్ పెట్టి క్లిక్ బెయిట్ రాజకీయాలు చేయద్దు.
* ఓటమిని గౌరవించాలి: ఒక సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, అంతమాత్రాన దర్శకుడు విఫలమైనట్టు కాదు. ఒక సినిమా ఫలితం దర్శకుడి భవిష్యత్తును నిర్ణయించకూడదు.
* కించపరచడం నేరం: విమర్శ అనేది ఎప్పుడూ వ్యక్తిగత దూషణగా మారకూడదు, ఒక సినిమా వెనుక ఎన్నో ఏళ్ల త్యాగం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
* విశ్వసనీయత ముఖ్యం: సిల్లీ కామెంట్స్, ఇన్సల్ట్స్ చేయడం వల్ల రివ్యూయర్లు తమ క్రెడిబిలిటీని కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read: Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!
ప్రస్తుత రివ్యూల ధోరణిని ఎద్దేవా చేస్తూ.. “ముందు ముందు రివ్యూలు ఎలా ఉంటాయంటే.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వస్తుంది? లొకేషన్లో పక్కన ఎవరైనా వాయిస్తున్నారా? అని అడిగినా ఆశ్చర్యం లేదు” అంటూ సెటైర్లు వేశారు. నటీనటుల వాయిస్ కి, పాట పాడే సింగర్ వాయిస్ కి సంబంధం లేదని విమర్శించే స్థాయికి వెళ్తే, ఆ రివ్యూలకి అర్థం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. రివ్యూలను ఎవరూ ఆపలేరని, కానీ అవి సినిమాను, సినిమా వెనుక ఉన్న మనుషులను, చూసే ప్రేక్షకుడి భావోద్వేగాలను గౌరవించేలా ఉండాలని శ్రీను కోరారు.