Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!
- బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' దూకుడు
- రూ.700 కోట్ల క్లబ్ దిశగా ధురంధర్
- కింగ్ షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డును బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజా సినిమా ‘ధురంధర్’ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఊహించని విజయాన్ని అందుకున్న ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కేవలం మూడు వారాల్లోనే రూ.600 కోట్ల మార్కును దాటి.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ రికార్డును బ్రేక్ చేసింది.
ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. 22వ రోజు (డిసెంబర్ 26) ధురంధర్ సినిమా రూ.15 కోట్లు వసూలు చేసింది. మూడవ వారం కూడా మంచి వసూళ్లతో ఆకట్టుకుంది. రూ.173 కోట్లు వసూలు చేసింది. మొదటి వారంలో రూ.207.25 కోట్లు, రెండవ వారంలో రూ.253.25 కోట్లు వసూలు చేసింది. ధురంధర్ సినిమా మొత్తంగా రూ.648.50 కోట్లు (సుమారు $6.48 బిలియన్లు) వసూళ్లు సాధించింది. ఇక ధురంధర్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. గతంలో బాహుబలి 2, దంగల్, పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్కును దాటాయి.
Also Read
భారతదేశ వసూళ్ల పరంగా 2023లో వచ్చిన జవాన్ సినిమా (రూ.640 కోట్లు)ను ధురంధర్ అధిగమించింది. స్త్రీ 2 (రూ.598 కోట్లు), చావా (రూ.601 కోట్లు) రికార్డులను కూడా బద్దలు కొట్టింది. డైరెక్టర్ ఆదిత్య ధార్ సహా హీరో రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధురంధర్ నిలిచింది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడిలు నటించారు. సీక్వెల్ (ధురంధర్ 2) 2026న ఈద్ సందర్భంగా మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీ సహా అన్ని దక్షిణ భాషలలో ధురంధర్ 2 విడుదల కానుంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!