కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ అజిత్ ను చూశామని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read : NKR : అర్జున్ S/O వైజయంతి నైజాం డీల్ క్లోజ్
కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అజిత్ అభిమానులు హంగామా ఇప్పటినుంచే మొదలైంది. ఈ సినిమా రిలీజ్ కాబోయే థియేటర్లు అన్ని ఎటు చూసిన బ్యానర్స్, కటౌట్స్ తో నిండిపోయాయి. అయితే అజిత్ అభిమానుల అత్యుత్సహం ప్రమాదానికి దారితీసింది. అజిత్ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులోని తిరునల్వేలి PSS ముల్టీప్లెక్స్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ కటౌట్ ను ఏర్పాట్లు చేసారు అభిమానులు. అందుకోసం ఇనుప రాడ్స్ తో భారీ హైట్ ఉండేలా సెట్ వేశారు. కాని అంతటి బరువు బేర్ చేయలేక ఆ ఇనుప రాడ్స్ సెటప్ ఒక్కసారిగా గాలి తాకిడికి కుప్పకూలిపొయింది. ఆ సమయలో అక్కడ పని చేసేవారు పరుగులు తీయడంతో అదృష్టవ శాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మరోవైపు అసలు ఇటువంటి కార్యక్రమాలు చేయకండి అని అజిత్ కుమార్ ఎంత చెప్పిన కూడా ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమాను భారీ ఎత్తున సెలెబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు.
#GoodBadUgly Biggest Banner Collapse
— Kollywood Cinima (@KollywoodCinima) April 7, 2025