Gowtham Tinnanuri : గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూవీ కింగ్ డమ్. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీటీమ్ వరుస ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమా కథ గతంలో గౌతమ్ తిన్నమూరి రామ్ చరణ్ తో చేయాల్సిందే అంటూ ప్రచారం జరుగుతోంది. దానిపై తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ క్లారిటీ ఇచ్చారు. నేను రామ్ చరణ్ కు ఓ మూవీ లైన్ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. పూర్తి కథ రెడీ చేశాక అది ఆయనకు సెట్ కాదనిపించింది. అందుకే నేనే వద్దని చెప్పాను.
Read Also : Film Federation : సంచలనం.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..?
రామ్ చరణ్ తో మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆ కథ వద్దన్నాను. దాన్ని పక్కన పెట్టేశాను. విజయ్ కు మళ్లీ రావా కథ చెప్పాలని ప్రయత్నిస్తే ఆయనకు కుదరలేదు. కింగ్ డమ్ కథ అనుకున్నప్పుడు విజయ్ కు ఒక లైన్ చెప్పా. అది ఆయనకు నచ్చిన తర్వాతనే పూర్తి కథ రెడీ చేశాను. రామ్ చరణ్ తో తీద్దామనుకున్న కథకు, కింగ్ డమ్ కు సంబంధం లేదు. రెండింటి జానర్లు వేరే. రామ్ చరణ్ తో భవిష్యత్ లో తప్పకుండా సినిమా చేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు గౌతమ్ తిన్నమూరి.
Read Also : Tamannaah : వాళ్లు నా బాడీని అలానే చూస్తారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్