Film Federation : టాలీవుడ్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది. వేతనాలు పెంచి ఇవ్వని మిగతా వారి సినిమాలకు వెళ్లకూడదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కో ఆర్డినేషన్ కమిటీ కూడా వేసింది.
Read Also : Mass Jathara : మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్
పెంచిన వేతనాలు కూడా ఏ రోజువి ఆ రోజే ఇచ్చేయాలని చెప్పింది ఫెడరేషన్. ఈ రోజు వేతనాల విషయంలో ఫిలిం ఫెడరేషన్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ కు, ఫిల్మ్ ఫెడరేషన్ కు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా సినిమాల షూటింగులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ యూనియన్ స్ట్రైక్ వల్ల రేపు పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానున్న అల్లరి నరేష్ కొత్త మూవీ వాయిదా పడింది. చాలా సినిమాల షూటింగులు, కొత్త మూవీల ప్రారంభోత్సవాలు ఆగిపోనున్నట్టు తెలుస్తోంది.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..