అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఇది కాజల్ అభిమానులు సంతోషించాల్సిన తరుణం. ఆమె భర్త గౌతమ్ మొత్తానికి తన పోస్ట్ తో కాజల్ ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ మొదటి బిడ్డను 2022లో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఊహాగానాల తర్వాత ఈ జంట చివరకు రూమర్స్ కు విశ్రాంతినిచ్చి, నూతన సంవత్సర సందర్భంగా అధికారికంగా విషయాన్ని ధృవీకరించారు. గౌతమ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో కాజల్ అందమైన ఫోటోను పంచుకున్నాడు. ఆ పిక్ తో పాటు “ఇదిగో 2022 మీ కోసం చూస్తున్నాను” అని రాసి, దాని తర్వాత ఒక గర్భిణీ స్త్రీ ఎమోజీని షేర్ చేయడం విశేషం.
Read Also : హీరోయిన్ కు కాంగ్రెస్ లీడర్ కొడుకు ఓపెన్ ప్రపోజల్… కానీ… !
అంతేకాదు న్యూఇయర్ సందర్భంగా కాజల్ తన భర్త గౌతమ్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసింది. అందులో బేబీ బంప్ క్లియర్ గా కన్పిస్తోంది. ఆమె ఆకుపచ్చ థై స్లిట్ డ్రెస్ లో ఉండగా, గౌతమ్ తన సెమీ క్యాజువల్ వేషధారణలో హుషారుగా కనిపించాడు. ఇక ఇటీవలే వీరిద్దరూ తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2020లో ముంబైలో వివాహం చేసుకున్నారు. కోవిడ్ -19 కారణంగా వారి గ్రాండ్ వెడ్డింగ్‌కు దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
