Bulliraju : బుల్లిరాజు.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు పేరు. ఏదైనా చైల్డ్ పాత్ర ఉందంటే మనోడినే ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మనోడి రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని బుల్లిరాజు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో అందరికంటే ఎక్కువగా గుర్తింపు వచ్చింది మాత్రం బుల్లిరాజుకే. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. ఓ రీల్ వీడియోతో బాగా పాపులర్ అయ్యాడు.
Read Also : Karan Johar : బాలీవుడ్ లో అసలైన స్టార్లు వాళ్లే.. కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..
ఆ వీడియో చూసిన అనిల్ రావిపూడి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో రేవంత్ కెరీర్ మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. డిమాండ్ బాగా ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నాడంట. ఒక్క రోజుకు రూ.60 వేల నుంచి పాత్రను బట్టి రూ.లక్ష దాకా డిమాండ్ చేస్తున్నాడంట. నిర్మాతలు కూడా అంత ఇచ్చేందుకు ఓకే చెప్తుండటంతో మనోడు ఇంకా రెచ్చిపోతున్నట్టు సమచారం. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలనే సామెతను బుల్లిరాజు బాగానే వాడుకుంటున్నాడు.